అల్కారజ్, గాఫ్ ముందంజ
ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటి టైటిల్ నెగ్గిన నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కారజ్ గ్రాస్కోర్టులోనూ జోరు కొనసాగిస్తున్నాడు.
- డబుల్స్‌లోనూ నాగల్‌కు నిరాశ
లండన్: ఇటీవలే ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్‌లో సత్తాచాటి టైటిల్ నెగ్గిన నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కారజ్ గ్రాస్కోర్టులోనూ జోరు కొనసాగిస్తున్నాడు. వింబుల్డన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కారజ్ బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 7-6 (7/5), 6-2, 6-2తో అలెగ్జాండర్ వుకిక్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించి మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో కాస్త ప్రతిఘటించిన వుకిక్ ఆ తర్వాత స్పెయిన్ కుర్రాడి జోరు ముందు నిలబడలేకపోయాడు. డేనిల్ మెద్వెదెవ్ 6-7 (3/7), 7-6(7/4), 6-4, 7-5తో ముల్లర్ (ఫ్రాన్స్)ను చిత్తుచేసి రెండో రౌండ్‌కు చేరాడు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కోకో గాఫ్ 6-2, 6-1తో టొడొనిను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత ఆటగాడు సుమిత్ నాగల్.. డబుల్స్‌లోనూ నిరాశపరిచాడు. డబుల్స్ తొలి రౌండ్లో నాగల్-లజోవిచ్ ద్వయం 2-6, 2-4తో మార్టిన్-మునర్ జోడీ చేతిలో పరాభవం పాలైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-5, 6-4తో హాస్, అరెండ్స్ ద్వయంపై గెలిచి ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్ 33వ సినిమాకు రంగం సిద్ధం.. దర్శకుల రేసులో అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి..!
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

