Team India | వీరులొచ్చేశారు.. ఢిల్లీలో రోహిత్ సేనకు ఘనస్వాగతం
టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ: టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్‌కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌తో స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్ఇండియాకు అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు రోహిత్ సేన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందితో మోదీ అల్పాహార విందు చేయనున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో ముంబైకి బయల్దేరుతుంది. అక్కడ సాయంత్రం 5 గంటలకు ఓపెన్‌టాప్ బస్సులో రోడ్ షో నిర్వహించనున్నారు. కాగా, ప్రపంచకప్ ముగిసి ఐదు రోజులు గడిచినా భారీ తుఫాను కారణంగా బార్బడోస్‌లోనే ఆగిన టీమ్ఇండియా ఎట్టకేలకు బుధవారం సాయంత్రం స్థానిక గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఎయిరిండియా చాంపియన్స్ 24 వరల్డ్ కప్’ అనే ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరింది.
ముంబైలో విజయోత్సవ ర్యాలీ
మోదీతో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్న భారత జట్టు.. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం దాకా (సుమారు రెండు కిలోమీటర్లు) ఓపెన్ బస్‌లో ప్రపంచకప్ వీరులు విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారు. ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్ చేశాడు.
‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్ డ్రైవ్ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం’ అంటూ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.
రోజంతా బిజీ షెడ్యూల్
-
- ఉదయం 06:20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి రాక.
- 06:45కు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లి 9 గంటలకు ప్రధాని నివాసానికి బయల్దేరుతారు.
- 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ప్రధానితో సమావేశం.
- 2 గంటలకు ముంబైకి ప్రయాణం.
- సాయంత్రం 4 గంటలకు ముంబైకి చేరుకుంటారు.
- 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం.
- రాత్రి 7.30 గంటలకు వాంఖడేలో బీసీసీఐ సత్కారం.
It’s home 🏆 #TeamIndia pic.twitter.com/bduGveUuDF
— BCCI (@BCCI) July 4, 2024
Men’s Indian Cricket Team lands at Delhi airport after winning the #T20WorldCup2024 trophy.
(Source: Delhi Airport) pic.twitter.com/kaCCjYy2oM
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Rohit Sharma with the T20 World Cup trophy arrives at Delhi airport.
India defeated South Africa by 7 runs on June 29, in Barbados, to clinch the second T20I title. pic.twitter.com/fJlKsWd0xh
— ANI (@ANI) July 4, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Mumbai
- Pm Modi
- T20 World Cup
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

