రాయపర్తి, జనవరి 4 : హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి నిప్పు పెట్టేందుకు యత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం రాయపర్తి మండలం బంధన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం శివాజీ విగ్రహాన్ని సందర్శించి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ వెంటనే నిందితులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆరె కులస్తులతో కలిసి ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ అక్రి రాంజీనాయక్, రాష్ట్ర ఆరె కుల భవన్ నిర్మాణ కమిటీ చైర్మన్ కౌడగాని నర్సింగరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, గారె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని కొండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డబ్బా ఖాళీ అవుతున్నదని దయాకర్ రావు విమర్శించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎనబోతుల దేవేందర్, పట్నం సురేశ్, లింగాల అఖిల్, రాచకొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కర్ర సరితారవీందర్రెడ్డి సారథ్యంలో ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. పార్టీలో చేరిన వారందిరినీ తాను కంటికి రెప్ప లా కాపాడుకుంటానని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దేశగా ని ఉపేందర్, మహ్మద్ అబ్బాస్ అలీ, బట్టు వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు.