Harmanpreet Kaur : ఆసియా కప్‌లో ఎనిమిది సార్లు విజేత అయిన భారత మహిళల జట్టుకు టీ20 వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. తొలిసారి 2020లో ఫైనల్ చేరిన టీమిండియా అనూహ్యంగా కప్ చేజార్చుకుంది. ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సేన ట్రోఫీయే లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లనుంది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో 10 రోజుల వరల్డ్ కప్ క్యాంప్ అనంతరం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి అత్యుత్తమ జట్టుతో వెళ్తున్నా. కచ్చితంగా ఆస్ట్రేలియా గండాన్ని దాటుతాం అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లనున్న భారత జట్టు బలమైనదని హర్మన్‌ప్రీత్ అంది.
🗣️ If I go there, play freely, and enjoy my cricket, I know I can change a lot of things
Captain @ImHarmanpreet speaks ahead of #TeamIndia‘s departure for the #T20WorldCup pic.twitter.com/5UHFLFTskD
— BCCI Women (@BCCIWomen) September 24, 2024
మంగళవారం కోచ్ అన్మోల్ మజుందార్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. మా జట్టు విషయానికొస్తే.. కొందరు చాలా ఏండ్లుగా ఆడుతున్నారు. వాళ్లకు వాళ్ల బాధ్యతలు ఏంటో తెలుసు. ‘ప్రస్తుత జట్టు పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. వరల్డ్ కప్ పోటీలకు వెళ్తున్న అత్యుత్తమ జట్టు ఇది అని నేను చెప్పగలను అని ఆమె వెల్లడించింది. అంతేకాదు ఐసీసీ ట్రోఫీల్లో కొరకరాని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాకు ఈసారి తమ చేతిలో ఓటమి తప్పద’ని చెప్పింది.
🚨 NEWS 🚨
Presenting #TeamIndia‘s squad for the ICC Women’s T20 World Cup 2024 🙌 #T20WorldCup pic.twitter.com/KetQXVsVLX
— BCCI Women (@BCCIWomen) August 27, 2024
ఆస్ట్రేలియా బలమైన జట్టే. అందులో సందేహం లేదు. కానీ, భారత్ తమకు సవాల్ విసరగలదని వాళ్లకు కూడా తెలుసు. అది నిజంగా మాకు సానుకూలమైన అంశం. ఆసీస్‌తో ఆడినప్పుడు ఆ జట్టున ఏదోరోజు, ఏదో సమయంలో ఓడిస్తాం. చాలా ఏండ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ గెలుపొందడం అనేది మాకు గొప్ప అవకాశం. అందుకని మేము సమిష్ఠిగా పోరాడి ఆస్ట్రేలియాను ఓడిస్తాం’ అని హర్మన్‌ప్రీత్ తెలిపింది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
అక్టోబర్ 3వ తేదీన యూఏఈలో వరల్డ్ కప్ మొదలవ్వనుంది. అంతకంటే ముందు వామప్ మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో టీమిండియా తలపడనుంది. ఇక అక్టోబర్ 4న హర్మన్‌ప్రీత్ సేనకు న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఉంది.
భారత స్క్వాడ్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా ఘోష్(వికెట్ కీపర్), యస్తికా భాటియా(వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజీవన.
ట్రావెలింగ్ రిజర్వ్స్ : ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), తనూజ కన్వర్, సైమా థాకూర్.