Jr NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రం నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. మరో వైపు బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘జిగ్రా’లో నటిస్తున్నది. ఇద్దరు కలిసి ‘దేవరా కా జిగ్రా’ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇద్దరూ గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ బాలీవుడ్ దర్శకత నిర్మాత కరణ్ జోహర్ సైతం పాల్గొన్నాడు. ఇద్దరూ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముంబయిలో తనకు అలియా భట్ బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్టీఆర్ తెలిపాడు. బాంబేలో అలియాని తప్ప మరో స్నేహితురాలిని ఊహించుకోలేనని.. తన తర్వాతే రణ్బీర్తో స్నేహం చేసినట్లు చెప్పాడు.
ఈ సందర్భంగా అలియా ‘దేవర’ మూవీలోని ‘చుట్టమల్లె చుట్టేస్తాంది’ తెలుగు పాటను పాడింది. ఎన్టీఆర్ వావ్ అంటూ అభినందించారు. దేవర మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా నటించనున్నారు. ఈ నెల 27న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్నది. ఇక అలియా జిగ్రా మూవీలో నటిస్తున్నది. ఈ మూవీ అక్టోబర్ 11న విడుదల కానున్నది. విదేశీ జైలులో ఉన్న సోదరుడిని విడిపించేందుకు ఓ సోదరి చేసే పోరాటం ఇతివృత్తంగా సినిమా తెరకెక్కింది.