Arjun Tenudulkar : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) ఈరోజుతో 25వ వసంతంలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోదరి సారా టెండూల్కర్(Sara Tendulkar) అతడికి శుభాకాంక్షలు తెలిపింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ అనుబంధాన్ని గుర్తు చేస్తూ..చిన్నప్పటి ఫొటోను పోస్ట్ చేస్తూ అర్జున్‌కు అభినందనలు చెప్పింది.
మా ఇంటి బేబీకి, మా ప్రపంచానికి కేంద్రమైన నీకు హ్యాపీ బర్త్ డే. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతాను అని సారా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సచిన్ – అంజలీల దంపతుల గారాలపట్టీ అయిన సారా ముంబైలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
లెజెండరీ క్రికెటర్ తనయుడైన అర్జున్ పేస్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. అయితే.. అందరూ ఊహించినట్టు జాతీయ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. సచిన్ కొడుకుగా అభిమానుల్లో ఉండే అంచనాలను అతడు అందుకోలేకపోయాడు. అయితే. ఈమధ్య దేశవాళీ క్రికెట్లో అర్జున్ 9 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గోవా తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 9/90తో టచ్‌లోకి వచ్చాడు. కానీ.. బ్లూ జెర్సీ వేసుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుంది. అందుకని మరింత కసితో సాధన చేస్తున్నాడు అర్జున్.
ఐపీఎల్లో అర్జున్ తన తండ్రి ఆడిన జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. 2023లో ముంబై ఇండియన్స్ (Mumbai Iindians) జెర్సీ వేసుకున్నాడు. దాంతో, ఒకే ఫ్రాంచైజీకి ఆడిన తండ్రీ కొడుకులుగా సచిన్, అర్జున్‌లు రికార్డు నెలకొల్పారు. ఇక 17వ సీజన్లో గాయం కారణంగా ఐదు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు. కేవలం 3 వికటె్లు తీసి.. బ్యాటింగ్‌లో 13 పరుగులు చేశాడంతే.