Samsung Fab Grab Fest sale | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ (Fab Grab Fest) సేల్ ప్రకటించింది. ఈ ఫెస్ట్ సేల్ లో భాగంగా సెలెక్టెడ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు, గెలాక్సీ బుక్స్, టాబ్లెట్లు, ఫోన్లూ టాబ్లెట్ల విడి భాగాలు, టీవీలపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది శాంసంగ్. ఈ నెల 26 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్లపై 53 శాతం వరకూ డిస్కౌంట్ పొందొచ్చు. శాంసంగ్ వెబ్ సైట్, శాంసంగ్ షాప్ యాప్, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్లలో ఈ ఆఫర్లు లభిస్తాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ లు, మానిటర్లపైనా విస్తృత శ్రేణి డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది శాంసంగ్.
ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతోపాటు సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులపై బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఆఫర్ 40 శాతం వరకూ అంటే గరిష్టంగా రూ.15 వేల వరకూ అదనపు రాయితీ పొందొచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐలతోపాటు సెలెక్టెడ్ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై స్మార్ట్ టీవీలు కొనుగోలు చేస్తే 22.5 శాతం (గరిష్టంగా రూ.25 వేలు) kenrsw aVr’hsigdr.
సెలెక్టెడ్ గెలాక్సీ జడ్ సిరీస్, గెలాక్సీ ఎస్ సిరీస్, గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్లపై 53 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 6 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.1,249లతో డిస్కౌంట్ ధరపై శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ఈ ఇయర్ బడ్స్ అందిస్తోంది.
డిస్కౌంట్లు లభించే స్మార్ట్ ఫోన్లు ఇవే
సెలెక్టెడ్ శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్ పై 27 శాతం రాయితీ లభిస్తుంది. గెలాక్సీ బుక్ 4 మోడల్ కొనుగోలు చేస్తే ఎఫ్హెచ్డీ ఫ్లాట్ మానిటర్ రూ.1,920లకే సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ పై లభించే గెలాక్సీ బుక్స్ ఇవే..
సెలెక్టెడ్ శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఏ9, శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్9 సిరీస్ మోడళ్లపై రాయితీలు లభిస్తాయి. వీటితోపాటు గెలాక్సీ వాచ్ సిరీస్ లపై 74 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది శాంసంగ్ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్. డిస్కౌంట్ ట్యాబ్ సిరీస్ లు ఇవే..
సెలెక్టెడ్ స్మార్ట్ టీవీలపై 43 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్రేమ్ స్పీకర్లు, ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ తదితరాలపైనా ఇవే ఆఫర్లు వర్తిస్తాయి. కస్టమర్లు శాంసంగ్ 55-అంగుళాల టీవీలు, శాంసంగ్ స్మార్ట్ టీవీ, సౌండ్ బార్ అదనపు భారం లేకుండా కొనుక్కోవచ్చు. సెలెక్టెడ్ 32 అంగుళాల, అంతకంటే పొడవైన మోడల్ టీవీలపై మూడేండ్ల సమగ్ర వారంటీ ఆఫర్ చేస్తుంది.. అలా వారంటీ ఆఫర్ చేసిన టీవీలు ఇవే..