Harsha Sai | ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ బిగ్‌బాస్ ద్వారా ఫేమ్ అయిన ఓ యువతి నార్సింగి పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో సదరు యువతి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. అతనితో పాటు తండ్రి రాధాకృష్ణపై సైతం ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు యువతి స్టేట్మెంట్ని రికార్డు చేసి.. కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే, సదరు యువతి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.2కోట్ల వరకు మోసం చేసినట్లు సమాచారం. హర్షసాయి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్‌లో అందరికీ సహాయం అందిస్తూ.. వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. అయితే, స్వీయ దర్శకత్వంలో హీరోగా ‘మెగా’ పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మిత్రశర్మ హీరోయిన్గా నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నది.