T20 World Cup Win : ఇప్పుడు ఎక్కడ చూసినా పొట్టి క్రికెట్ హంగామానే కనిపిస్తోంది. ఏడాదిలో నిత్యం ఏదో దేశంలో టీ20 లీగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తొలిసారి నిర్వహించిన టీ20 పోటీల్లో చాంపియన్ మాత్రం మన భారత పురుషుల జట్టే. సరిగ్గా 17 ఏండ్ల క్రితం సెప్టెంబర్ 24 వ తేదీన భారత జట్టు టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
దక్షిణాఫ్రికా గడ్డపై సగర్వంగా చిట్టి కప్‌ను అందుకున్న ‘మెన్ ఇన్ బ్లూ’ చరిత్ర సృష్టించింది. ఈ చిరస్మరణీయ రోజు భారత క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ సందర్భంగా అభిమానులు ‘జయహో టీమిండియా’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. తొలి వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో మొదలెట్టిన పొట్టి ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా గడ్డపై జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ అప్పుడే కొత్తగా కెప్టెన్ అయ్యాడు. దాంతో, అతడి సారథ్యంలోని భారత్‌పై ఏ మాత్రం అంచనాలు లేవు. అయితే.. లీగ్ దశ నుంచి దుమ్మురేపుతూ టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఆఖరి సమరంలో ఫైనల్లో చిరకాల ప్రత్యర్థిపై ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో అద్భుత విజయంతో టీమిండియా తొలిసీజన్ చాంపియన్‌గా అవతరించింది. టైటిల్ పోరులో భారత్ నిర్దేశించిన 158 పరుగుల ఛేదనలో పాక్ టాపార్డర్ తడబడింది.
#OTD 📌
India Won their first T20
World Cup.☄️
And an ICC trophy after 24
Years.🌟Young Hitman🐐played a major role in the title winning tournament for India. 🇮🇳👏 pic.twitter.com/5qtsQGpq1s
— SINGLE⁴⁵ (@ImSingle45) September 24, 2024
ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(316) విజృంభణతో ధోనీ సేన విజయానికి చేరువైంది. అయితే.. మిస్బాహుల్ హక్(43) టెయిలెండర్లతో కలిసి చివరిదాకా పోరాడాడు. పాక్‌ను గెలుపు వాకిట నిలిపిన అతడు భారత శిభిరంలో గుబులు రేపాడు అయితే.. ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మ అతడిని బోల్తా కొట్టించాడు.
IRFAN PATHAN – The Star of T20 World Cup 2027 with ball…
– Wickets for Malik & Afridi…#MSDhoni#T20WorldCup2007
— MANU. (@Manojy9812) September 24, 2024
ఫైన్ లెగ్‌లో బౌండరీ కొట్టాలనుకున్న మిస్బా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడే కాచుకొని ఉన్న శ్రీశాంత్ పరుగెత్తుతూ వచ్చి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. అంతే.. 152 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయింది. ధోనీ బృందం తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. 1983 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఖాతాలో రెండో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టింది ఈ టోర్నీలోనే.