SIT | తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ఏర్పాటు..చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం
SIT | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ(Tirumala laddu ) కల్తీ వ్యవహారాన్ని తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విచారణకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని(Sarvashrestha Tripati) నియమించింది.సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు. సీఐలు, ఎస్ఐలు సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.
తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిని జంతువుల కొవ్వుతో తయారు చేశారని చంద్రబాబు వారం రోజుల క్రితం వెల్లడించడంతో ఆ అంశంపై దుమారం చెలరేగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు కల్తీనూనే వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. కల్తీకి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇందులో భాగంగా సిట్ ఏర్పాటు చేసి నిజనిజాలు వెలికి తీసేందుకు ఐజీ స్థాయి అధికారిని చీఫ్‌గా నియమించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

