Srilanka PM | శ్రీలంక ప్రధాని పీఠంపై చాలా ఏళ్లకు మళ్లీ మహిళ.. నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం
Srilanka PM | శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియమితులయ్యారు. మంగళవారం ఆమె నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మరో మహిళ హరిణి.
Srilanka PM : శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య (Harini Amarasuriya) నియమితులయ్యారు. మంగళవారం ఆమె నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. సిరిమావో బండారు నాయకే (1994-2000) తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మరో మహిళ హరిణి. 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మరో ఇద్దరు నేతలను క్యాబినెట్ మంత్రులుగా నియమించారు.
దాంతో శ్రీలంకలో దిసనాయకేతోపాటు మొత్తం నలుగురితో కూడిన క్యాబినెట్ కొలువుదీరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక, ఆరోగ్యం, పెట్టుబడులు లాంటి కీలక శాఖలను కేటాయించారు. అధ్యక్ష ఎన్నికల అనంతరం అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
శ్రీలంకలో హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ అధ్యాపకురాలిగా గుర్తింపు పొందిన హరిణి ఆ దేశ మూడో మహిళా ప్రధానిగా చరిత్ర లిఖించారు. ఎన్పీపీకి చెందిన ఎంపీలు విజిత హెరాత్, లక్ష్మణ్ నిపుణ రచిచి క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయం సాధించి శ్రీలంక నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.
ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం వెల్లడించారు. శ్రీలంకలో పార్లమెంట్ ముందస్తు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

