Adam Gilchrist : ప్రపంచంలోని అత్తుత్యమ వికెట్ కీపర్, ఓపెనర్లలో ఆడం గిల్‌క్రిస్ట్(Adam Gilchrist) ఒకడు. గిల్లీగా ఫేమస్ అయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సుదీర్ఘ కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరాడు. వరల్డ్ కప్ హీరోగా, ఆసీస్ బెస్ట్ కీపర్‌గా ఇలా చాలానే మైలురాళ్లను అధిగమించాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా రాణిస్తున్న కంగారూ దిగ్గజం తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసిన భారత క్రికెటర్ ఎవరో చెప్పాడు. తాజాగా ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడిన గిల్లీ తాను అతడి కారణంగానే ఆటకు వీడ్కోలు పలికానని అన్నాడు.
కెరీర్ ఆసాంతం విధ్వంసక ఇన్నింగ్స్‌లతో, కండ్లు చెదిరే వికెట్ కీపింగ్‌తో అభిమానుల మనసు దోచుకున్న గిల్‌క్రిస్ట్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టింది ఎవరో తెలుసా.. వీవీఎస్ లక్ష్మణ్. అవును.. ఈ విషయం గురించి గిల్లీ ఏం చెప్పాడంటే.. ‘2008లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది.
Gilchrist tells an amazing story of India 🇮🇳 touring Australia 🇦🇺 and how VVS Laxman played a huge part in him retiring.pic.twitter.com/n2CpeygjxW
— Don Cricket 🏏 (@doncricket_) September 24, 2024
అడిలైడ్ టెస్టులో లక్ష్మణ్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాను. కానీ, నావల్ల కాలేదు. చాలా తేలికైన ఆ క్యాచ్‌ను నేను నేలపాలు చేశాను. చూస్తుండగానే ఆ బంతి నా గ్లోవ్స్‌ను తాకి కింద పడింది. నేను ఫిట్‌గా లేనని, ఇక ఆస్ట్రేలియా తరఫున కెరీర్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసిందని ఆ క్షణమే నా మనసులో అనుకున్నా’ అని వివరించాడు.
దేశవాళీలో అదరగొట్టిన గిల్‌క్రిస్ట్ 1996లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. మెరుపు బ్యాటింగ్‌తో, అబ్బురపరిచే వికెట్ కీపింగ్ నైపుణ్యంతో గిల్లీ.. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. సహ ఓపెనర్ మాథ్యూ హెడెన్ తోడుగా మెరుపు ఆరంభాలు ఇచ్చిన ఈ డాషింగ్ బ్యాటర్ 1990 నుంచి 2000ల మధ్య ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యంలో కీలక పాత్ర పోషించాడు. వరుసగా మూడు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (1999, 2003, 2007)లు గెలుపొందిన కంగారూ జట్టులో అతడు సభ్యుడు. 2008లో భారత్‌పై ఆఖరి టెస్టు ఆడిన ఈ దిగ్గజ ఆటగాడు.. అదే ఏడాది మార్చిలో వన్డేలకు గుడ్ బై చెప్పాడు. తన 12 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో గిల్‌క్రిస్ట్ 96 టెస్టులు, 287 వన్డేలు, 13 టీ20లు ఆడాడు.