మరిపెడ, సెప్టెంబర్24 : మహబూబాబాద్ జిల్లా(Mahabubabad district) మరిపెడలోని బస్టాండ్ వద్ద విజయవాడ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న చేపల వ్యాన్(Fish van) మంగళవారం పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం స్థానిక బస్టాండ్ వద్ద ఓ వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టింది(Overturned). ఈ ఘటనంలో స్థానిక డిగ్రీ కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్న వీరారం గ్రామస్తుడు జిన్న ఐలయ్యకు గాయాలయ్యాయి.
వెంటనే క్షతగాత్రుడిని వైద్యం కోసం స్థానిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. అయితే వాహనంలోని చేపలు రోడ్డుపై పడిపోవడంతో విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు, ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చేపలను లూటీ చేశారు. మరికొందరు బస్తాల్లో కుక్కి ద్విచక్ర వాహనాల్లో చేపలను పట్టుకెళ్లారు. దీంతో గంటన్నరపాటు ఘటనా స్థలమంతా రద్దీగా మారింది.