SVSN Verma : తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పంది మాంసం తింటాడని వ్యాఖ్యానించారు. ఆయనకు ఫోర్క్ తినడం అలవాటు అన్నారు. సాక్షాత్తు ప్రపంచ ఇలవేల్పుగా కొలిచే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో పంది కొవ్వును కలిపించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.
ఏకంగా 15 లీటర్ల పాలు కాస్తే కూడా ఒక కిలో నెయ్యి తయారు కాదని, అలాంటిది రూ.320కి కిలో నెయ్యి ఎలా సరఫరా చేయగలుగుతున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వం గమనించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో క్వాలిటీ నెయ్యి తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో గుర్తించి దానికంటే తక్కువకు టెండర్ వేసిన టెండర్ దారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
కల్తీ జరిగిన సమయంలో ఉన్న కాంట్రాక్టర్లు అందరిని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని వర్మ అన్నారు. ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లోగాని, తీర్థ ప్రసాదాల్లో కానీ అవినీతికి పాల్పడిన వారిపై పిడి యాక్టు పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ప్రసాదంలో ఏమైనా కలుపుకో నాకు ఎంత ఇస్తావు అనే ధోరణిలో టెండర్లు సాగాయని విమర్శించారు. మేం పురుగుల మందు ఇస్తే జగన్మోహన్ రెడ్డి తాగుతారా..? అని నిలదీశారు.