అమరావతి : ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గజ్జెల లక్ష్మికి (Gajjela Laxmi) కూటమి ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆమె పదవి కాలం ఆగస్టులోనే ముగియడంతో వెంటనే తొలగించాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సంబంధిత శాఖకు ఆదేశాలు ఇస్తూ నిన్ననే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం గజ్జెల లక్ష్మి ప్రకటించారు.
2026 మార్చి 15 వరరకు ఆమె పదవీకాలం ఉన్నా అర్దాంతరంగా తొలగించడాన్ని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం(Legal Fight) చేస్తానని ఆమె వెల్లడించారు. వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఈ ఏడాది మార్చిలో గజ్జెల వెంకట లక్ష్మిని అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) ఆమెను ఎన్నికలకు రెండు నెలల ముందు ఏపీ మహిళా కమిషన్ చైర్మన్గా నియమించారు.
మరోవైపు ముంబై నటి(Mubai Actress) కాదంబరి జత్వాని వ్యవహారంలో గజ్జెల లక్ష్మి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమె ముంబైకి చెందిన వ్యక్తి కావటంతో మహారాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించాలంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు.