శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 10, 2020 , 21:10:08

స్మార్ట్‌ఫోన్‌తో.. మోడరన్‌ థాలి! వైరల్‌ అవుతున్న భజ్జీ ట్వీట్‌

స్మార్ట్‌ఫోన్‌తో.. మోడరన్‌ థాలి!  వైరల్‌ అవుతున్న భజ్జీ ట్వీట్‌

ముంబై: టీమిండియా స్పిన్నర్‌ హర్బజన్‌ సింగ్‌ ట్విటర్లో చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. రెస్టారెంట్లు, హోటళ్లు లేదా ఇళ్లలో వడ్డించే భోజనం థాలిపై భజ్జీ ట్వీట్‌ చేశాడు.  థాలిలో వచ్చే వంటకాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్‌ ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది.  అయితే స్మార్ట్‌ఫోన్‌ పెట్టుకునేకునేందుకు అనువుగా 'మోడరన్‌ థాలి'  ఉందంటూ భజ్జీ ట్విటర్లో సరదాగా షేర్‌ చేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. logo