భారత్‌కు చేరిన అమెరికా అత్యవసర సాయం
భారత్‌కు చేరిన అమెరికా అత్యవసర సాయం | కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతున్నది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది.

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతున్నది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో పలు దేశాలు ముందుకు వచ్చి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాలు వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రిని పంపాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం వంద మిలియన్ డాలర్ల సాయం ప్రకటించగా.. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి భారత్ తొలి కొవిడ్ అత్యవసర సహాయ సామగ్రిని అందుకున్నది. 400కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, దాదాపు ఒక మిలియన్ ర్యాపిడ్ కరోనావైరస్ టెస్ట్ కిట్లు, ఇతర పరికరాలతో, సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్పోర్టర్ ఇవాళ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానంలో దిగింది.

ఈ మేరకు యూఎస్ ఎంబసీ భారతదేశానికి తాము సహాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు సహాయం అందిస్తున్నామని, సహాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ‘యునైటెడ్ స్టేట్స్ నుంచి అనేక అత్యవసర కొవిడ్-19 సహాయక సరుకులలో మొదటిది భారతదేశానికి చేరుకుంది. 70 సంవత్సరాల పరస్పర సహకారంతో, యునైటెడ్ స్టేట్స్ భారతదేశంతో నిలుస్తుంది. మేము సమిష్టిగా కొవిడ్-19 మహమ్మారితో పోరాడుతాం’ అంటూ ట్వీట్ చేసింది. #USIndiaDosti అంటూ యూఎస్ ఎంబసీ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చింది.
అమెరికా నుంచి వచ్చిన వాటిల్లో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 1.50కోట్ల ఎన్-95 మాస్కులు, పది లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్స్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ముడి సరుకు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూఎస్ లోని వివిధ కంపెనీలు మరియు వ్యక్తులు విరాళంగా ఇచ్చే పరికరాలను కూడా తీసుకువచ్చే ప్రత్యేక విమానాలు వచ్చే వారంలో కూడా కొనసాగుతాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భారతదేశానికి నిరంతర మద్దతు ప్రకటించారు. ‘అమెరికాలో వైరస్ విజృంభించిన సమయంలో భారత్ మా పక్షాన నిలబడింది. ఇప్పుడు భారత్‌కు అవసరం వచ్చింది. మేం భారత్ పక్షాన నిలబడాలనే దృడ సంకల్పం తీసుకున్నాం’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

