టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ (Paralympics) అధ్యాయం ముగింపు దశకు చేరుకున్నది. చక్రవర్తి నరుహిటో సోదరుడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో పర్యవేక్షణలో.. రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య బాణాసంచా వెలుగులతో నేషనల్ స్టేడియం కళకళలాడింది. 13 రోజులుగా వివిధ అంశాలలో పోటీపడిన క్రీడాకారులతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. ముగింపు వేడుకకు ‘హార్మోనియస్ కాకోఫోనీ’ అనే పేరు పెట్టారు. పలువురు నటులు, వైకల్యాలున్న ఇతరులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భారత్ నుంచి అవని లేఖరా త్రివర్ణ పతాకంతో ముందు నడిచింది. ముగింపు వేడుకకు భారత బృందంలోని మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు.
టోక్యో పారాలింపిక్స్ లో 19 ఏళ్ల షూటర్ అవని లేఖరా స్వర్ణంతో పాటు రెండు పతకాలను సాధించింది. అవని ఎస్‌హెచ్1 క్యాటగిరీలో 10 మీ ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణ పతకం, 50 మీటర్ల రైఫిల్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఈసారి భారతదేశం 5 స్వర్ణాలతోపాటు మొత్తం 19 పతకాలు సాధించి.. పతకాల పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది.
టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు ఆగస్టు 24-సెప్టెంబర్ 5 మధ్య జరిగాయి. ఇందులో 22 క్రీడాంశాల్లో 539 పతకాల పోటీలు ఉన్నాయి. 9 క్రీడా విభాగాలలో భారతదేశానికి చెందిన మొత్తం 54 మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు. కాగా, 96 స్వర్ణాలతో పాటు మొత్తం 207 పతకాలతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. బ్రిటన్ 41 స్వర్ణంతో మొత్తం 124 పతకాలతో రెండవ స్థానం, అమెరికా 37 స్వర్ణంతో మొత్తం 104 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచింది. తదుపరి పారాలింపిక్స్ 2024 లో పారిస్‌లో జరుగుతాయి.
Change begins with sports… First time a woman para athlete marches with the National Flag.. thank you @AvaniLekhara .. you so richly deserve this honor. You have in true sense won hearts of Indians. #Tokyoparalympics2020 #closingceremony Oh it's farewell time already. Sayonara pic.twitter.com/Zi6VaZdQRI
— Deepa Malik (@DeepaAthlete) September 5, 2021
ఫ్యాక్టరీలో బాలికపై లైంగికదాడి
బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు : సీఎం తండ్రిపై కేసు నమోదు
స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..