Barbie doll : బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?
Barbie doll : చిన్నారుల చేతుల్లో అతుక్కుపోయే బార్బీ బొమ్మలాగా కనిపించాలన్న తాపత్రయమే ఈ అమ్మడి పర్సు ఖాళీ చేసిందంట. తాను చిన్ననాట ఎక్కువ సమయం బార్బీ బొమ్మలతోనే గడిపేది. వాటిని ...

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటుంటారు. అందం విషయానికొస్తే.. అందానికి మెరుగులద్దేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి కూడా వెనుకాడరు. మన దగ్గర ఆడవాళ్లు అందం, ఆహార్యం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారన్నది తెలిసిందే. విదేశీయులు కూడా మన వాళ్లకన్నా ఏం తక్కువ తినలేదు. అందం కోసం, డ్రెస్సుల కోసం లక్షల డాలర్లు నీళ్ల మాదిరిగా ఖర్చు చేస్తుంటారు. దీనికి ఉదాహరణగా జర్మనీకి చెందిన ఈ జెస్సీ బన్సీనే చెప్పుకోవచ్చు. (Barbie doll)
అందంగా ఉండటం వేరు.. అందంగా కనిపించాలనే తాపత్రయం వేరు. అచ్చం ఇలాంటి తాపత్రయమే జర్మనీకి చెందిన జెస్సీ బన్సీకి ఉండేది. చిన్నారుల చేతుల్లో అతుక్కుపోయే బార్బీ బొమ్మలాగా కనిపించాలన్న తాపత్రయమే ఈ అమ్మడి పర్సు ఖాళీ చేసిందంట. తాను చిన్ననాట ఎక్కువ సమయం బార్బీ బొమ్మలతోనే గడిపేది. వాటిని మేకప్ చేస్తూ అందంగా తీర్చిదిద్దేది. కొన్నాళ్లకు బార్బీ మాదిరిగానే తాను కూడా తయారుకావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనికి తల్లిదండ్రులు అభ్యంతర పెట్టడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసి వియన్నా చేరుకున్నది. అక్కడ బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ కోసం అప్పటి వరకు దాచుకున్న సొమ్మును ఖర్చుపెట్టింది. ఆ తర్వాత పెదవులకు కూడా సర్జరీలు చేయించుకున్నది. 2020 లో మరోసారి బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీకు వెళ్లింది. ఇప్పటివరకు బ్రెస్ట్ ఇంప్లాంట్స్, లిప్ ఫిల్లర్స్, బొటాక్స్, లైపోసక్షన్ తదితర సర్జరీల కోసం దాదాపు రూ.24 లక్షలు ఖర్చు చేసింది.
జెస్సీ ఇన్‌స్టాగ్రామ్‌ను చూస్తే ఆమె అందం కోసం ఎంతగా తాపత్రపడిందో ఆమె ఫొటోలను చూసి తెలుసుకోవచ్చు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేని ‘పెద్దవాళ్లకు మాత్రమే’ అవసరమయ్యే అనేక వస్తువులను, విషయాలను ఫ్యాన్స్‌కు పరిచయం చేయడం కోసం ప్రత్యేక పేజీని కూడా స్టార్ట్ చేసింది. బింబో కమ్యూనిటీలో సభ్యురాలు అయినందుకు చాలా గర్వంగా ఉన్నదంటోంది ఈ అమ్మడు.
ఇవి కూడా చదవండి..
ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర
ఏవీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు : సీఎం తండ్రిపై కేసు నమోదు
స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

