Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Costly Cottage : బ్రిటన్‌లోని డేవాన్ సముద్రం ఒడ్డున ఉన్న ఈ ఆఫ్ గ్రిడ్ హౌస్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ కాటేజ్‌కు విద్యుత్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ దరిదాపుల్లో లేదు. అయినప్పటికీ దాదాపు రూ.5.56 కోట్లకు అమ్ముడుపోయింది. దీని ప్రత్యేకత ఏంటంటే..

మనం ఓ ఇల్లు కొందామనుకుంటే.. కరెంట్ సరఫరా, నీటి కనెక్షన్, డ్రైనేజీ, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనేది చెక్ చేసుకుంటాం. ఆ ఇంటికి దరిదాపుల్లో ఇంటెర్నెట్ సౌకర్యం లేకపోతే.. ఆ వైపు కూడా కన్నెత్తి చూడం. అలాంటి ఓ కాటేజ్‌ను రూ.5.5 కోట్లకు అమ్మకానికి పెట్టారు. (Costly Cottage) అదెక్కడున్నది..? దాని ప్రత్యేకతలు ఏంటి..? అనేవి తెలుసుకుందాం.
డ్రీం హోం అంటే కనీసం విద్యుత్, నీరు, డ్రైనేజీ, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఎలా? ఉన్న పళంగా అమ్మితే ఎవరు కొంటారు అనే డౌటు ప్రతీ ఒక్కరికీ వస్తుంది. బ్రిటన్‌లోని అచ్చం అలాంటి కాటేజ్ ఒకటి అత్యధిక మొత్తానికి అమ్మకానికి పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. బ్రిటన్‌లోని డేవాన్ సముద్రం ఒడ్డున ఉన్న ఈ ఆఫ్ గ్రిడ్ హౌస్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ కాటేజ్‌కు విద్యుత్ లేదు. నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్ దరిదాపుల్లో లేదు. అయినప్పటికీ దాదాపు రూ.5.56 కోట్లకు అమ్మకానికి పెట్టాడు దాని ఆసామి. దీని ప్రత్యేకత ఏంటంటే.. బ్లూ సీ కి సమీపంలోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉండటమేనంట. ఈ కాటేజ్ నేషనల్ ట్రస్ట్ యాజమాన్యంలోని మన్సాండ్ బీచ్‌పైన ఉన్న రిమోట్ గేట్‌అవేలో ఉన్నది. ప్రకృతితో మమేకమై ప్రశాంతమైన జీవనాన్ని ఆస్వాదించుకోవాలనుకునే వారికి ఈ కాటేజ్ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అందుకే అంత పెద్ద మొత్తంలో వెచ్చించి ఆ కాటేజ్‌ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారంట.
ఈ కాటేజ్‌లో రెండు పెద్ద బెడ్ రూంలు ఉన్నాయి. పైన ఒక గడ్డితో చేసిన గది ఉన్నది. ఇందులో లాంజ్, డైనింగ్ రూం, ఫ్రంట్ అండ్ బ్యాక్ వరండా, రెండు గెస్ట్ బెడ్రూంలు, పవర్‌రూం, వంట గదులను కలిగి ఉన్నది. ఈ కాటేజ్‌ను 1,345 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కిచెన్‌లో గ్యాస్ కుకర్, ఎల్పీజీ లైట్లు ఉన్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసి తాగునీటిగా మార్చే సదుపాయం కలిగి ఉన్నది. ఈ కాటేజ్‌కు వెళ్లేందుకు బీచ్ నుంచి రోడ్డు ఉన్నదని, ఈ ప్రదేశం కారు పార్కింగ్ నుంచి 15 నిమిషాల్లో నడిచి చేరుకోవచ్చునని ఈ ఆస్తి విక్రేత మిచెల్ స్టీవెన్స్ తెలిపారు. ఇక్కడ ఉండే వారు సొంత ప్రైవేట్ ఒయాసిస్ను కలిగి ఉన్న అనుభూతిని ఆస్వాదించవచ్చునని, ఇక్కడ ఉండటం వలన రోజూవారి జీవితంలో ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చునని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు : సీఎం తండ్రిపై కేసు నమోదు
స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

