Rakesh Tikait : స్మశానంగా మార్చినా.. ఈ స్థలాన్ని వదిలిపెట్టం : రాకేశ్ తికాయత్
Rakesh Tikait : ప్రస్తుతం దీక్ష చేపట్టిన ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినప్పటికీ.. ఈ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కేంద్రం తమ గోడును పెడ చెవిన పెడుతున్నదని...

ముజఫ్ఫర్‌నగర్ : ప్రస్తుతం దీక్ష చేపట్టిన ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినప్పటికీ.. ఈ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ (Rakesh Tikait) హెచ్చరించారు. కేంద్రం తమ గోడును పెడ చెవిన పెడుతున్నదని, ఇక వెనక్కి తగ్గేది లేదన్నారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ శివారులో నిరసనలు తెలుపుతున్నప్పటికీ కేంద్రం వినిపించుకోకపోవడం విచారకరమన్నారు. ముజఫ్ఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్ బహిరంగ సభకు రాకేశ్ తికాయత్ హాజరై కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ‘కేంద్రం ఏం చేసినా పర్వాలేదు. ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినా భయపడేది లేదు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు’ అని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు.
‘ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగుతుంది. స్వాతంత్య్రం కోసం జరిగినట్లుగానే ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ రైతులు చేరింది ప్రభుత్వం తమ అసంబద్ధ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడానికే’ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌లో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్‌కు 15 రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేసింది.
ఇవి కూడా చదవండి..
107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

