Bengaluru : 107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?
Bengaluru : కర్నాటక రాష్ట్ర రాజధానిగా విలసిల్లుతున్న బెంగుళూరు.. భాషల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. బెంగళూరు జిల్లాలో కనీసం 107 భాషలు ...

బెంగళూరు : కర్నాటక రాష్ట్ర రాజధానిగా విలసిల్లుతున్న బెంగుళూరు (Bengaluru).. భాషల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. బెంగళూరు జిల్లాలో కనీసం 107 భాషలు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని 2011 సెన్సస్ డాటా ఇటీవలి విశ్లేషణ వెల్లడిస్తున్నది. దీని ప్రకారం దేశంలో అత్యంత భాషాపరంగా విభిన్నమైన జిల్లాగా బెంగళూరు నిలిచింది.
2011 సెన్సస్ డాటా విశ్లేషణను బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ నాన్-రెసిడెంట్ సీనియర్ ఫెలో షమిక రవి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ ముదిత్ కపూర్ నిర్వహించారు. బెంగుళూరు జిల్లాలో షెడ్యూల్ చేయని 22 కంటే తక్కువ, 84 షెడ్యూల్ కాని భాషలు మాట్లాడతారని విశ్లేషణలో వెల్లడించారు. దేశంలోని ఏ జిల్లాలో కూడా ఇంత భాషా సంపద లేదని స్పష్టమవుతున్నది.
బెంగళూరు తర్వాత నాగాలాండ్‌లోని దిమాపూర్, అసోంలోని సోనిత్పూర్లలో కూడా 100 కు పైగా భాషలు మాట్లాడుతారు. దిమాపూర్‌లో 103 భాషలు.. సోనిత్‌పూర్‌లో 101 భాషలు మాట్లాడుతున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురిలో 98 భాషలు, మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ 96, నైతుతి ఢిల్లీలో 97, అసోం కర్బీ ఆంగ్లాంగ్‌లో 95, మహారాష్ట్రలోని పుణెలో 93, పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌లో 91, మహారాష్ట్రలోని ముంబై సబర్బన్‌లో 81 భాషలు మాట్లాడతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వలసల కారణంగా భాషలు విస్తరిస్తున్నట్లు గుర్తించారు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా భాసిల్లుతున్న బెంగళూరు.. ఇలాంటి వలస జనాభా భాషల గుర్తింపును కాపాడుకోగలగడం వల్లనే 107 భాషలు మాట్లాడుతున్నట్లు తేలింది. బెంగళూరులో 44.5 శాతం మంది కన్నడ, 15 శాతం తమిళం, 14 శాతం తెలుగు, 12 శాతం ఉర్దూ, 6 శాతం హిందీ, 3 శాతం మంది మలయాళం మాట్లాడే వారున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆధునిక వైద్య మౌలిక వసతుల ఏర్పాటు అవసరం: వెంకయ్యనాయుడు
బంగారు వడ పావ్ కావాలా? ఎక్కడ దొరుకుతుందంటే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

