Sourav Ganguly : ఐపీఎల్ 18వ సీజన్ వాయిదా పడడంతో టోర్నీ నిర్వహణ.. సాధ్యాసాధ్యాలపై అనుమానాలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ దుశ్చర్యల కారణంగా యుద్ధ వాతావరణంలో ఐపీఎల్ తదుపరి మ్యాచ్‌లు ఆడిస్తారా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మాత్రం లీగ్ విజయవంతం అవుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌ను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బీసీసీఐ నిర్వహిస్తుందని దాదా వెల్లడించాడు.
‘ఐపీఎల్‌ను వారం రోజులు వాయిదా వేశారనే వార్త తెలిసింది. అయితే.. ప్రతిష్ఠాత్మకమైన ఈ లీగ్‌ను బీసీసీఐ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే.. భారత బోర్డుకు ఆ సామర్థ్యం ఉంది. కోవిడ్ సమయంలో యావత్ ప్రపంచం ఆందోళనతో ఉంది. అలాంటి రోజుల్లోనే బీసీసీఐ ఐపీఎల్‌ను పూర్తి చేసింది.
Sourav Ganguly backed the BCCI to act appropriately, and complete the IPL 2025#ipl2025 #IndiaPakistanWar #iplsuspended https://t.co/DgzAOBeYx3
— India Today Sports (@ITGDsports) May 9, 2025
ఇప్పుడు దాయాది కారణంగా నెలకొన్న ఉద్రిక్తతలు కూడా అలాంటివే. కానీ, భారత ప్రభుత్వం సూచచనల మేరకు బీసీసీఐ లీగ్‌పై నిర్ణయం తీసుకుంటుంది. మన దేశ సైనికులు మనకు ఎంతో గర్వకారణం. యుద్ధం వచ్చినా రాకున్నా వాళ్లు రాత్రింబవళ్లు దేశాన్ని కాపాడుతుంటారు. అందుకే మనమంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం’ అని గంగూలీ వెల్లడించాడు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేసింది బీసీసీఐ. సరిహద్దుల్లో పాక్ డ్రోన్లతో దుశ్చర్యలకు పాల్పడుతుండడంతో.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా వారం పాటు లీగ్‌ను వాయిదా వేసింది. ఈ లోగా పరిస్థితులు చక్కబడితే.. తదుపరి 16 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించి టోర్నీని విజయవంతం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
TATA IPL 2025 suspended for one week.
More details here 👇👇 | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025