Road Accident | వెంగళరావునగర్, మే 9 : రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఉద్యోగి బి.సంజయ్ రావు(77) హెల్త్ చెకప్ కోసం మొండా మార్కెట్లోని మిలటరీ హాస్పిటల్కు బయల్దేరారు. ఎస్ఆర్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద బైక్ యూటర్న్ తీసుకుంటుండగా.. మరో ద్విచక్ర వాహనం వేగంగా రావడంతో సంజయ్ రావు బ్రేక్ వేశారు. దాంతో అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలవడంతో.. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు దవాఖానాకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు సంజయ్ కుమారుడు చంద్ర మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.