England Team | వరల్డ్ కప్ వైఫల్యంతో మేల్కొన్న ఇంగ్లండ్.. వెస్టిండీస్ సిరీస్‌లో యంగ్‌స్టర్స్‌కు చాన్స్
England Team : డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England Team) వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో దారుణమైన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టునిండా హిట్టర్లే ఉన్నా వరుస ఓటములతో పసికూనను తలపించింది. ప్రపంచ కప్‌లో బట్లర్ సేన ఘోర వైఫల్యంతో ఆ దేశ క్రికెట్ బోర్డు....
England Team : డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England Team) వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో దారుణమైన ఆటతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టునిండా హిట్టర్లే ఉన్నా వరుస ఓటములతో పసికూనను తలపించింది. ప్రపంచ కప్‌లో బట్లర్ సేన ఘోర వైఫల్యంతో ఆ దేశ క్రికెట్ బోర్డు మేల్కొంది. మోగా టోర్నీలో విఫలమైన జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్‌పై వేటు వేసింది. మోకాలి సర్జరీ కోసం వేచి చూస్తున్న బెన్ స్టోక్స్(Ben Stokes)ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.
మరో ఏడు నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున వెస్టిండీస్ సిరీస్‌కు యువ క్రికెటర్లకు చాన్స్ ఇచ్చింది. ఆదివారం ఆ దేశ క్రికెట్ బోర్డు వన్డే, టీ20 సిరీస్‌లకు జోస్ బట్లర్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ప్రకటించింది. డిసెంబర్లో ఇంగ్లండ్ జట్ట కరీబియన్ పర్యటనకు బయలుదేరనుంది.
We’ve announced our squads for our upcoming tour of the Caribbean 👇
— England Cricket (@englandcricket) November 12, 2023
వన్డే స్క్వాడ్ : జోస్ బట్లర్(కెప్టెన్), జాక్ క్రాలే, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హర్ట్లే, విల్ జాక్స్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, ఓలీ పోప్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, జాన్ టర్నర్. బ్రాడన్ కర్సే, రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్.
టీ 20 స్క్వాడ్ : జోస్ బట్లర్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, మోయిన్ అలీ, అట్కిన్సన్, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ టకెట్, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, రీసే టాప్లే, జాన్ టర్నర్, క్రిస్ వోక్స్.
సొంత గడ్డపై 2019లో తొలిసారి వరల్డ్ కప్‌ను ముద్దాడిన ఇంగ్లండ్ ఈసారి మాత్రం తేలిపోయింది. టాపార్డర్ నుంచి ఏడో స్థానం వరకూ పవర్ హిట్టర్లతో నిండిన బట్లర్ సేన తొలిమ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్నది. ఆ తర్వాత వేదికలు మారినా, ప్రత్యర్థి మారినా ఇంగ్లీష్ ఆటగాళ్ల ఆట మాత్రం మారలే.

ఒకవైపు పసికూనలుగా ముద్రపడిన అఫ్గనిస్థాన్, నెదర్లాండ్స్ సంచనాలు సృష్టిస్తుంటే.. ఇగ్లండ్ జట్టు వరుస పరాజయాలతో అభిమానులను ఆశ్చర్యపరిచింది. సెమీస్ రేసులో ముందు నుంచే వెనకబడిన బట్లర్ బృందం.. చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సాధికార విజయంతో టోర్నీని ముగించింది.
ఇవి కూడా చదవండి
-
Ebrahim Raisi | ఇజ్రాయేల్ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు
-
Virat Kohli | బెంగళూరులో విరాట్ అభిమానుల సందడి.. చిన్నస్వామి స్టేడియం దగ్గర 49 కోహ్లీ కటౌట్స్.. Video
-
Rebel Movie | కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ‘రెబెల్’.. టీజర్ రిలీజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

