Ebrahim Raisi | ఇజ్రాయేల్ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించండి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు
Ebrahim Raisi : ఇజ్రాయేల్ - హమాస్ పరస్పర దాడులతో పాలస్తీనా చిన్నాభిన్నమవుతోంది. గాజాతో పాటు పలు నగరాల్లో లక్షలాది మంది నిరాశ్రయులువుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) శనివారం ఇజ్రాయేల్ సైన్యంపై సంచలన...
Ebrahim Raisi : ఇజ్రాయేల్ – హమాస్ పరస్పర దాడులతో పాలస్తీనా చిన్నాభిన్నమవుతోంది. గాజాతో పాటు పలు నగరాల్లో లక్షలాది మంది నిరాశ్రయులువుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) శనివారం ఇజ్రాయేల్ సైన్యంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్(Riyadh)లో జరిగిన అరబ్, ముస్లిం దేశాల నాయకుల సమావేశం వేదికగా.. పాలస్తీనాలో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయేల్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా పరిగణించాలని ఆయన ముస్లిం దేశాలను కోరాడు.
‘గాజాలో ఆక్రమణలకు, నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయేల్ సైన్యాన్ని ఇస్లాం దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి. అంతేకాదు యూదులకు రాజకీయ, ఆర్థిక సంబంధాలకు ముగింపు పలకాలి. వాళ్లతో వ్యాపార కార్యకలాపాలను రద్దు చేసుకోవాలి’ అని ఇబ్రహీం పిలుపునిచ్చారు. ఇజ్రాయేల్‌కు సైనిక, ఆర్థిక సహాయం అందిస్తున్న అమెరికాను ఆయన తప్పుపట్టారు. యూదులు వాడుతున్న యుద్ధ సామాగ్రి, ఇంధనం పూర్తిగా అమెరికాకు చెందినదే. గాజాలో జరుగుతున్న విధ్వంసకాండకు అమెరికానే కారణం అని ఇరాన్ అధ్యక్షుడు మండిపడ్డాడు.
ఇవి కూడా చదవండి
-
Lara Wolvaardt | దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్‌గా లారా వొల్వార్డ్
-
Lal Salaam Movie | రజనీకాంత్ దీపావళి ట్రీట్.. ‘లాల్ సలామ్’ టీజర్ రిలీజ్
-
TTD | శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

