Lal Salaam Movie | రజనీకాంత్ దీపావళి ట్రీట్.. ‘లాల్ సలామ్’ టీజర్ రిలీజ్
Lal Salaam | 'జైలర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). ఈ జోష్‌లో ఆయన వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వీటిలో ఒకటి కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లాల్‌సలామ్ (Lal Salaam).
Lal Salaam | ‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). ఈ జోష్‌లో ఆయన వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వీటిలో ఒకటి కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘లాల్‌సలామ్’ (Lal Salaam). విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన లాల్ సలామ్ టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని టీవిలో చూసి ఉంటారు. రేడియోలో విని ఉంటారు. కానీ డైరెక్ట్ గా చూశారా.. అంటూ క్రికెట్ మ్యాచ్‌తో ఈ టీజర్ ప్రారంభకాగా, ఇది స్పోర్ట్స్ డ్రామాలా కనిపిస్తుంది, అయితే ఈ మ్యాచ్ వలన హిందూ ముస్లింల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ మొయిదీన్ భాయ్ అనే స్పెషల్ రోల్‌తో అలరించనున్నాడు. రజనీకాంత్ తన సిగ్నేచర్ స్లో మోషన్ స్టైల్లో విలన్లను కొట్టడం టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది. మరోవైపు ఈ మూవీ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘కై పొ చే’ (Kai Po Che) సినిమాకు రీమేక్‌గా ఈ రూపొందుతున్నట్లు తెలుస్తుంది.
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, మరియు తంగదురై ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

