Virat Kohli | ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యా.. నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను : కోహ్లీ
Virat Kohli | ఐపీఎల్ (IPL)లో భాగంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా (Team India) రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) అదరగొట్టిన విషయం తెలిసిందే.
Virat Kohli | ఐపీఎల్ (IPL)లో భాగంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియా (Team India) రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) అదరగొట్టిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగి ఆడిన కోహ్లీ సెంచరీతో జట్టును నాలుగో స్థానంలో నిలిపాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా శతక జోరు కొనసాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అద్భుత విజయం సాధించింది. తనకు బాగా అచ్చొచ్చిన హైదరాబాద్‌లో కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. హైదరాబాద్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ శతక గర్జన చేశాడు. నాలుగేండ్ల తర్వాత సెంచరీ ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఆర్సీబీ విజయంలో కీలకమయ్యాడు.
కాగా, గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో కోహ్లీ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ తనపై వచ్చిన విమర్శలపై మ్యాచ్ అనంతరం కోహ్లీ స్పందించాడు. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశాడు. ‘నేను గత గణాంకాలను పట్టించుకోను. ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఇది నా ఆరో ఐపీఎల్ శతకం. నేను ఒత్తిడిలో ఉన్నందున కొన్ని సార్లు నాకు నేను తగినంత క్రెడిట్ ఇచ్చుకోను. అదేవిధంగా బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. అది వారి అభిప్రాయం’ అని కోహ్లీ అన్నారు.
గురువారం కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
సన్‌రైజర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచారు. ముఖ్యంగా తనకు బాగా అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. విరాట్ కోహ్లీ (63 బంతుల్లో 100, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో తనకు తిరుగులేదని చాటిచెప్పగా, కెప్టెన్ డుప్లెసిస్ (71) తనదైన ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకగా, హైదరాబాద్ (8) ఆఖరి స్థానానికి పరిమితమైంది.
కోహ్లీ అరుదైన రికార్డు..
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ. దీంతో ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు సాధించిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సరసన చేరాడు. గేల్ 142 మ్యాచుల్లో ఆరు శతకాలు నమోదు చేయగా, కోహ్లీ 236వ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకుని రికార్డు కెక్కాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు.
💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏
He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6
— JioHotstar Reality (@HotstarReality) May 18, 2023
Also Read..
కోహ్లీ కేక… హైదరాబాద్‌పై ఆర్సీబీ విజయం
Tsunami | న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
Cannes 2023 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన బీటౌన్ తారలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

