Tsunami | ఫ్రాన్స్ భూభాగమైన న్యూ కలెడోనియా (New Caledonia)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. లాయల్టీ ఐలాండ్స్ (Loyalty Islands)కు ఆగ్నేయంగా శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.7 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (United States Geological Survey ) తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
అయితే, ఈ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు అధికారులు సునామీ (Tsunami ) హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియా, ఫిజీ (Fiji), వనాటు ( Vanuatu) ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read..
ZapCom Group: హైదరాబాద్‌లో జాప్‌కామ్ సెంటర్: మంత్రి కేటీఆర్
Congress | కాంగ్రెస్‌ను పట్టిపీడిస్తున్న గ్రూపు రాజకీయాలు.. పదవుల లొల్లితో రగులుతున్న ‘హస్తం’
Queen Elizabeth | క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చు రూ.1,655 కోట్లు.. ప్రకటించిన ట్రెజరీ