Cannes 2023 | ఫ్రాన్స్ (French) వేదికగా 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (76th annual Cannes Film Festival) అట్టహాసంగా కొనసాగుతోంది. ఏటా జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలు పోతుంటారు. ఈ ఏడాది కూడా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న పలువురు ప్రముఖులు ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ లో పాల్గొని సందడి చేశారు.
మన దేశం నుంచి కూడా కొందరు తారలు ఈ వేడుకకు హాజరై రెడ్ కార్పెట్‌పై హొయలొలికించారు. బాలీవుడ్ స్టార్ నటి ఐశ్మర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) , సారా అలీఖాన్, ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ఊర్వశీ రౌతెలా, ఈశా గుప్తా, మానుషీ చిల్లర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. విభిన్నమైన డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై వాక్ చేస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.
ఈ వేడుకలో ఐశ్వర్య రాయ్ డ్రెస్ అందరినీ ఆకర్షించింది. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్ ధరించిన ఐష్.. రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఇక మృణాల్, ఈశా వైట్ డ్రెస్సెస్‌లో లైట్ మేకప్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Cannes 2023 1
Cannes 2023 2
Cannes 2023 3
Also Read..
Bondugula | చెక్కు చెదరని చరిత్ర.. అలనాటి వైభవాన్ని చాటుతున్న నిర్మాణాలు
Tsunami | న్యూ కలెడోనియాలో భారీ భూకంపం.. పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు
Vijayendra prasad | సచివాలయం నిర్మాణం అద్భుతం.. ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ ప్రశంస