MS Dhoni | తన టీషర్ట్‌తో అభిమాని బైక్ తుడిచిన ధోనీ.. నెటిజన్లు ఫిదా
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తన టీషర్టుతో ఫ్యాన్ బైక్‌ను శుభ్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆటతీరుతో పాటు సింప్లిసిటీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ధోనీ కనిపిస్తే చాలు ఆయన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్, షేక్ హ్యాండ్స్, సెల్ఫీలకు ఎగబడుతుంటారు ఫ్యాన్స్. ఆయనకు సంబంధించిన ఏ చిన్న వీడియోనైనా సరే ఇట్టే నెట్టింట వైరల్ చేసేస్తుంటారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఫిదా చేసేస్తోంది.
మిస్టర్ కూల్‌ను చూసిన ఓ అభిమాని ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో తన బైక్‌పై ఆటోగ్రాఫ్ ఇవ్వాలంటూ ధోనీని కోరాడు. ఫ్యాన్ కోరిక మేరకు ధోనీ బైక్ ముందు భాగంలో సంతకం చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ.. బైక్ మీద మరకలు కనిపించడంతో తన టీషర్టుతో స్వయంగా దానిని శుభ్రం చేసి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాడు. అనంతరం బైక్ మీద ఆటోగ్రాఫ్ ఇచ్చి ఫ్యాన్‌ను ఖుషీ చేశాడు. అంతేకాదండోయ్ బైక్‌పై కూర్చొని దాని విశేషాలను కూడా అడిగి తెలుసుకున్నాడు.
just one t-shirt increasing the price of that bike 🤌#MSDhoni𓃵 #CricketTwitter pic.twitter.com/BQqAyAtAUT
— Mohd Nazim 🇮🇳 (@ImNaz33) November 29, 2023
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ధోనీ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్వయంగా తన టీషర్టుతో బైక్ తుడిచి సంతకం చేయడాన్ని కొనియాడుతున్నారు. మరికొందరైతే.. ‘కేవలం ఒక్క టీషర్ట్.. ఆ బైక్ ఖరీదును పెంచేసింది’ అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. ధోనీకి బైక్స్, కార్లు అంటే మహా ఇష్టం అన్న విషయం తెలిసిందే. తన గ్యారేజీలో లెక్కలేనన్ని ఖరీదైన బైక్స్, కార్లు ఉన్నాయి. సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటాడు. రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటారు. తాజాగా ధోనీ ఓ బెంజ్ కారులో కూడా అభిమానులకు దర్శనమిచ్చాడు. ఆ వీడియో కూడా నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతూ.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
MS Dhoni driving Mercedes G Class with 0007 number plate. pic.twitter.com/JVh7CwYfMU
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 29, 2023
Also Read..
Lufthansa flight | భార్యాభర్తల మధ్య గొడవ.. ఢిల్లీలో ల్యాండ్ అయిన బ్యాంకాక్ విమానం
Glass Door | గ్లాస్‌డోర్ మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి.. వీడియో
Gold | జోస్ అలుక్కాస్‌లో భారీ చోరీ.. ఒక్కడే 25 కేజీల బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

