Lufthansa flight | భార్యాభర్తల మధ్య గొడవ.. ఢిల్లీలో ల్యాండ్ అయిన బ్యాంకాక్ విమానం
Lufthansa flight | భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం (Husband Wife Fight) కారణంగా బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఫ్లైట్ (Bangkok Flight) ఒకటి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
Lufthansa flight | భార్యాభర్తల మధ్య గొడవ (Husband Wife Fight) బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఓ విమానాన్ని (Bangkok Flight) ఢిల్లీకి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.
లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన LH772 విమానం (Lufthansa flight) మ్యూనిచ్ నుంచి బ్యాంకాక్‌కు బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగానే అందులోని జర్మన్ వ్యక్తి అతని థాయ్ భార్య మధ్య వివాదం మొదలైంది. అదికాస్తా కాసేపటికి తీవ్రమైన వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో తన భర్తపై థాయ్ మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. భర్త తనని బెదిరిస్తున్నాడంటూ వారి సాయం కోరింది. దీంతో క్రూ సిబ్బంది ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దృష్టికి తీసుకెళ్లారు.
విమానాన్ని ముందుగా పాకిస్థాన్ విమానాశ్రయంలో దించేందుకు అనుమతి కోరారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. చివరికి ఢిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. దీంతో విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే భర్తని ఫ్లైట్ నుంచి దింపి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి అప్పగించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation ) వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత కాసేపటికి విమానం బ్యాంకాక్‌కు వెళ్లినట్లు తెలిపారు.
Also Read..
Gold | జోస్ అలుక్కాస్‌లో భారీ చోరీ.. ఒక్కడే 25 కేజీల బంగారం, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు
Feroz Khan | ఓటరుకు రూ.లక్ష.. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

