Feroz Khan | ఓటరుకు రూ.లక్ష.. నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌పై కేసు నమోదు
Feroz Khan | నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి (Congress Nampally MLA candidate) ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న (offering an amount of Rs 1 lakh to a voter) ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
Feroz Khan | తెలంగాణ శాసనసభ ఎన్నికలకు (Telangana Assembly Elections) రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి (Congress Nampally MLA candidate) ఫిరోజ్ ఖాన్ (Feroz Khan)పై తాజాగా కేసు నమోదైంది. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న (offering an amount of Rs 1 lakh to a voter) ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 171 సి, 188, 123 ఆర్పీ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు.
Telangana | A case has been booked against Congress Nampally MLA candidate Feroz Khan for allegedly offering an amount of Rs 1 lakh to a voter. The case has been booked under sections 171C, 188 and 123 RP Act: Hyderabad Police
— ANI (@ANI) November 29, 2023
తెలంగాణ శాసనసభ ఎన్నికలు గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్‌లోని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) వికాస్ రాజ్ ఆదేశించారు.
మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read..
Deeksha Divas | కేసీఆర్ ఆమరణ దీక్ష నడిచింది ఇలా.. ఇదీ టైమ్‌లైన్!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

