Telangana Budget Live Updates | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని చదవి వినిపించారు. శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ. 2.75 లక్షల కోట్లు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.
5 లక్షల కవరేజీని 10 లక్షల వరకు పెంచాం..
ఆరోగ్య శ్రీలో ఉన్న 1,672 చికిత్సల్లో 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతం పెంచాం..
ఆరోగ్య శ్రీలో కొత్తగా 163 వ్యాధులను చేర్చాం..
ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగిన డిజిటిల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తాం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలను 20 ఎకరాల్లో ఒకే చోట నిర్మిస్తాం
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాం
ఎస్సీ సంక్షేమం కోసం రూ. 33,124 కోట్లు
ఎస్టీ సంక్షేమం కోసం రూ. 17,056 కోట్లు
ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ. 6 లక్షల వరకు చెల్లింపులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం
ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఆర్సీసీ కప్పుతో వంట గది, టాయిలెట్ సౌకర్యం
స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు..
వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు
ఇందిరా జీవిత బీమా పథకం కూడా అమలు
దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం
ప్రజా పంపిణీ కోసం రూ. 3,836 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 29,816 కోట్లు
ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ. 50.41 కోట్లు
హోం శాఖ రూ. 9,564 కోట్లు
వైద్యం ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
ఐటీ రంగం రూ. 774 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 22,301 కోట్లు
ఆర్ అండ్ బీ రూ. 5,790 కోట్లు
పరిశ్రమల శాఖ రూ. 2,762 కోట్లు
విద్యారంగం రూ. 21,292 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలు రూ. 16,410 కోట్లు
అడవులు పర్యావరణం రూ. 1,064 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 9,200 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ. 17,056 కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ. 3,003 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ. 33124 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ - రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన - రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు
విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ రూ. 100 కోట్లు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూఏ. 1500 కోట్లు
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ. 1525 కోట్లు
పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రూ. 50 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డుకు రూ. 200 కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్ - రూ. 3,385 కోట్లు
హైడ్రా సంస్థ - రూ. 200 కోట్లు
జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన - రూ. 3,065 కోట్లు
హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన రూ. 500 కోట్లు
వ్యవసాయం - రూ. 72,659 కోట్లు
ఉద్యానవనం రూ. 737 కోట్లు
పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు
రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ. 723 కోట్లు
గృహజ్యోతి పథకం కోసం రూ. 2,418 కోట్లు
రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్..
రెవెన్యూ వ్యయం రూ. 2,20,945 కోట్లు
మూల ధన వ్యయం రూ. 33,487 కోట్లు
Bhatti Telangana
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ. 2.75 లక్షల కోట్లు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి శాసనసభకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన సంగతి తెలిసిందే.
నందినగర్‌లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రవేశపెట్టనున్నారు. ఈనేపథ్యంలో ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా తెలిపాయి. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో అధికార పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర బడ్జెట్‌కు (Telangana Budget) మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా బడ్జెట్‌ను మంత్రివర్గం ఆమోదించింది. మరికాసేపట్లో భట్టివిక్రమార్క రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణకు బడ్జెట్ పద్దును అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి తీసుకోనున్నారు.