Barack Obama: కమలా హ్యారిస్‌కు ఇంకా మద్దతు ఇవ్వని బరాక్ ఒబామా.. ఎందుకంటే
Barack Obama : కమలా హ్యారిస్‌కు ఇంత వరకు బరాక్ ఒబామా మద్దతు ప్రకటించలేదు. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా హ్యారిస్‌ను బైడెన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కానీ హ్యారిస్ విషయంలో ఒబామా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో .. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు డెమోక్రటిక్ పార్టీ నేతలు ఆ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) మాత్రం ఇంకా కమలా హ్యారిస్‌కు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌ను కమలా హ్యారిస్ ఓడించలేదని ఒబామా నమ్ముతున్నట్లు న్యూ యార్క్ పోస్టు ఓ కథనాన్ని రాసింది.
ఒబామా చాలా అప్సెట్లో ఉన్నారని, ఎందుకంటే ఆమె గెలవలేదని ఆయన అనుకుంటున్నట్లు బైడెన్‌కు చెందిన ఓ ఫ్యామిలీ వ్యక్తి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలిగా అసమర్థురాలు అవుతుందని ఒబామా పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేవలం అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ను తప్పించాలని ఒబామా ప్లాన్ వేశారని, దానిలో భాగంగానే నటుడు జార్జ్ క్లూనీతో ఆర్టికల్ రాయించినట్లు తెలుస్తోంది.
ఆరిజోనా సేనేటర్ మార్క్ కెల్లీకి అధ్యక్ష రేసులో పాల్గొనే అవకాశం ఇవ్వాలని ఒబామా ప్లాన్ వేసినట్లు ఆ కథనంలో రాశారు. వచ్చే నెలలో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించాలని ఆయన భావించారు. ఒబామా చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఆయన అనుకున్నట్లు జరగలేదని, అందుకే హ్యారిస్‌కు మద్దతు ఇచ్చే డెమోక్రటిక్ నేతల లిస్టులో ఆయన లేరని ఓ వ్యక్తి తెలిపారు.
కానీ త్వరలోనే కమలా హ్యారిస్‌కు ఒబామా మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నట్లు మరో వార్తా సంస్థ ఎన్బీసీ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

