Indian Origin MP | ఖలిస్తానీ తీవ్రవాదుల వల్ల కెనడా కలుషితమవుతోంది : భారత సంతతి ఎంపీ
Indian Origin MP | ఖలిస్తానీ తీవ్రవాదుల (Khalistani extremists) కారణంగా కెనడా (Canada) కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ (Indian Origin MP) చంద్ర ఆర్య (Chandra Arya) అన్నారు.
Indian Origin MP | ఖలిస్తానీ తీవ్రవాదుల (Khalistani extremists) కారణంగా కెనడా (Canada) కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ (Indian Origin MP) చంద్ర ఆర్య (Chandra Arya) అన్నారు. స్థానిక చట్టాలు అందించిన స్వేచ్ఛను వారంతా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటీవల వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో తనతో పాటు సన్నిహితులను భారత్‌కు వెళ్లిపోవాలంటూ హెచ్చరించడంపై చంద్ర ఆర్య స్పందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
‘హిందువులమైన మేము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. దక్షిణాసియాలోని ప్రతి దేశం, ఆఫ్రికా, కరేబియన్‌లోని అనేక దేశాల నుంచి, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చాం. కెనడా మా స్వస్థలం. కెనడా సామాజిక – ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. ఇక్కడ మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. చరిత్ర కలిగిన భారత సంస్కృతి, వారసత్వం ద్వారా కెనడా బహుళ సంస్కృతిక సంప్రదాయాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. ఈ క్రమంలో కెనడా ఇచ్చిన హక్కులను ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి కారణంగానే కెనడా కలుషితమవుతోంది’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాగా, ఎడ్మాంటన్‌లోని ‘బీఏపీఎస్’ స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. దేవాలయం గోడలపై రంగులు జల్లారు. విద్వేషపూరిత వ్యాఖ్యల్ని రాశారు. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనపై కూడా చంద్ర ఆర్య తీవ్రంగా తీవ్రంగా ఖండించారు. దేవాలయాలపై దాడులు సరికాదన్నారు.
In response to my condemnation of the vandalism of the Hindu temple BAPS Swaminarayan Mandir in Edmonton and other acts of hate and violence by Khalistan supporters in Canada, Gurpatwant Singh Pannun of Sikhs for Justice has released a video demanding me and my Hindu-Canadian… pic.twitter.com/vMhnN45rc1
— Chandra Arya (@AryaCanada) July 24, 2024
Also Read..
Parliament Session | పార్లమెంట్ సమావేశాలు వరుసగా నాలుగోరోజు ప్రారంభం
Pune Flooded | పూణెని ముంచెత్తిన వరద.. పాఠశాలలకు సెలవు
Mamata Banerjee | దీదీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయ్ : బంగ్లాదేశ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

