Pune Flooded | పూణెని ముంచెత్తిన వరద.. పాఠశాలలకు సెలవు
Pune Flooded | మహారాష్ట్రను భారీ వర్షాలు (Heavy Rain) ముంచెత్తుతున్నాయి. ఈ వర్షానికి ముఖ్యంగా ముంబై, పూణె నగరాలు నీట మునిగాయి.
Pune Flooded | మహారాష్ట్రను భారీ వర్షాలు (Heavy Rain) ముంచెత్తుతున్నాయి. ఈ వర్షానికి ముఖ్యంగా ముంబై, పూణె నగరాలు నీట మునిగాయి. చాలా చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూణెలో వరద బీభత్సం (Pune Flooded) సృష్టించింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
భారీ వర్షం కారణంగా పూణె, కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. దీంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షం కారణంగా అప్రమత్తమైన అధికారులు పాఠశాలలను మూసివేశారు (Schools Shut). ఈ వర్షాలకు ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు, అగ్నిమాపక శాఖ పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పర్యాటక ప్రాంతాలను 48 గంటల పాటు మూసివేయాలని పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read..
KCR | ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్
Mamata Banerjee | దీదీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయ్ : బంగ్లాదేశ్
BMW | సింగిల్ చార్జింగ్‌తో 460 కి.మీ.. బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ.. ధరెంతంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

