Mamata Banerjee | దీదీ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయ్ : బంగ్లాదేశ్
Mamata Banerjee | బంగ్లాదేశ్ (Bangladesh)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీదీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించింది.
Mamata Banerjee | బంగ్లాదేశ్ (Bangladesh)లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బంగ్లా అల్లర్లలో బాధితులైనవారు రాష్ట్రంలోకి వస్తే ఆశ్రయం కల్పిస్తామని (shelter promise) పేర్కొన్నారు. దీదీ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందించింది. ఆ వ్యాఖ్యలు సరికాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపింది. దీదీ ప్రకటనతో ఉగ్రవాదుల (terrorists)కు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది.
‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మాకు గౌరవం ఉంది. వారితో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీదీ ప్రకటనతో ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’ అని ఆ దేశ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.
కాగా, ఇటీవలే నిర్వహించిన మెగా ర్యాలీలో దీదీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఈ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు. ‘నేను బంగ్లాదేశ్ సార్వభౌమత్యం గురించి మాట్లాడటం లేదు. అది కేంద్రానికి సంబంధించినది. కానీ నిస్సహాయులైన ప్రజలు వస్తే మాత్రం మానవతా దృక్పథంతో స్పందిస్తాం’ అని అన్నారు. దీంతో దీదీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. అలాంటి అధికారం రాష్ట్రాలకు ఉండదని స్పష్టం చేసింది. అటువంటి అధికారం కేంద్రానిదేనని, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది.
Also Read..
Kangana Ranaut | 21లోగా వివరణ ఇవ్వండి.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు హిమాచల్ కోర్టు నోటీసులు
Heart Attack | సిస్టోలిక్ రీడింగ్ ఎక్కువగా ఉందా? అయితే గుండెపోటు రావొచ్చు!
Gods | మనిషి ఒత్తిడికి తగ్గట్టు శునకాలూ మారుతాయ్!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

