Gods | న్యూఢిల్లీ: మనిషి ఒత్తిడికి గురైనప్పుడు శరీరం నుంచి విడుదలయ్యే వాసనను శునకాలు పసిగట్టగలుగుతాయని, దానికి తగ్గట్టుగా తమ వ్యవహారశైలిని మార్చుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒత్తిడి వాసన రాగానే అవి కూడా నిరాశావాదంతో ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకులు వెల్లడించారు.
ఎవరైనా వ్యక్తి ఒత్తిడితో ఉన్నప్పుడు వారి నుంచి వెలువడే వాసనతో పక్కనున్న వ్యక్తి కూడా ప్రభావితుడు అవుతాడని గతంలోనే గుర్తించారు. ఇలాంటి ప్రభావమే జంతువులపైనా పడుతుందా? అని 18 శునకాలు, వాటి యజమానులను ఎంచుకొని పరీక్షించగా తాజా విషయం తెలిసింది.