మెదక్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): మెదక్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నాటి నుంచి బరితెగించి బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసు నమోదు చేయించడంతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తల ఆటో దహనం చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం రాత్రి పట్టణానికి చెందిన నవపేట మల్లారెడ్డి టిప్పర్ను గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దహనం చేశారు. కాగా మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు ఇండ్ల వద్దకు పోవడంతో భయంతో పారిపోయారు. అయితే టిప్పర్ దహనం చేసినప్పటికీ బాధిత కుటుంబ కాంగ్రెస్ నాయకులకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదని తెలిసింది. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే వాహనలు దహనం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాహనలు దహనం చేస్తున్న పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.