కడియం శ్రీహరి.. ఊసరవెల్లి!
ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా పార్టీలు మారుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
- వెన్నుపోట్లు పొడుస్తూ పార్టీలు మారుతున్నారు
- కేసీఆర్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలి: కొప్పుల
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా పార్టీలు మారుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై కడియం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. కడియం తన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కేసీఆర్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అన్ని రకాల పదవులు అనుభవించి, ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అయ్యారు ? అంటూ ప్రశ్నించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో కడియంకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. కేసీఆర్ పిలిచి డిప్యూటీసీఎం పదవి, రాజ్యసభ సీటు ఇచ్చారని గుర్తుచేశారు.
అయినప్పటికీ వెన్నుపోటుకు మారు పేరుగా నిలిచారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వరకు అందరికీ వెన్నుపోటు పొడుచుకుంటూ, పార్టీలు మారుతూ వచ్చారని దుయ్యబట్టారు. రాజకీయ పదవులు, అధికారం కోసం ఆయన ఎన్ని పార్టీలైనా మారుతారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇచ్చిన బీఫామ్పై గెలిచిన కడియంకు ఇజ్జత్ ఉంటే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమది సామంతుల జాతి కాదు అని, స్వతంత్రుల జాతి అని, బరి గీసి కొట్లాడే కేసీఆర్ జాతి అని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయని, అందులో ఒకటి తెలంగాణవాదుల జాతి అయితే, రెండోది తెలంగాణ ద్రోహుల పార్టీ అని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

