హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : అధిక ధరకు మక్కలను విక్రయించడం ద్వారా మార్క్‌ఫెడ్‌కు నష్టం రాకుండా చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ-వేలం విధానంలో సగటున టన్నుకు రూ.25, 370 రికార్డు స్థాయి ధరతో మక్కలను విక్రయించినట్టు వెల్లడించారు. ఈ-టెండర్ ద్వారా కాకుండా ఈ-వేలం వి ధానాన్ని అమలు చేయడం వల్ల మంచి ఫలితా లు వచ్చాయని పేర్కొన్నారు.
2025-26 యాసంగిలో మార్ఫెడ్ 14.6 లక్షల టన్నుల మక్కజొన్నలు కొనుగోలు చేసింది. సుమారు 3.8 లక్షల టన్నుల మక్కజొన్న గతంలోనే 22 వే లతో విక్రయించారు. మిగిలిన 10, 98 ,388 టన్నుల మక్కలను ఈ-వేలం ద్వారా విక్రయించగా, కనిష్ఠ ధర రూ.24,100, గరిష్ఠ ధర రూ. 26, 50 0, సగటు ధర రూ.25,370 చొప్పున లభించింది.