BMW | సింగిల్ చార్జింగ్‌తో 460 కి.మీ.. బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ.. ధరెంతంటే?
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..పలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలు. ఈ కారు బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది.
BMW | న్యూఢిల్లీ, జూలై 24: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..పలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ ధర రూ.54.9 లక్షలు. ఈ కారు బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ కల్పిస్తున్నది. ఎలక్ట్రిక్ మినీ కంట్రీమ్యాన్ కారు కేవలం 8.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 462 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 29 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీ రీచార్జి కానున్నది. రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, డైనమిక్ స్టేబిలిటీ కంట్రోల్, క్రాశ్ సెన్సార్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్‌తో రూపొందించింది. ఐదో జనరేషన్గా విడుదలైన ఈ కారు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద బుకింగ్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు రూ.44.9 లక్షల ధర కలిగిన మినీ కూపర్ ఎస్ మాడల్‌ను కూడా విడుదల చేసింది.
ప్రీమియం ఈ-స్కూటర్
దేశీయ మార్కెట్లోకి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు. కేవలం 2.6 సెకండ్లలో 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ స్కూటర్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది. దేశీయంగా తయారైన ఈ స్కూటర్ మెట్రోపాలిటన్ సిటీల్లో మాత్రమే విక్రయించనున్నది. బుకింగ్ చేసుకున్న వారికి సెప్టెంబర్ నుంచి డెలివరీ చేయనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

