BRS Leaders | హైదరాబాద్ : గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది. గురు, శుక్రవారాల్లో కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్నది. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరనున్నది.
గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు శామీర్‌పేటలో లంచ్ చేయనున్నారు. 2 గంటలకు లోయర్ మానేరు డ్యాం పర్యటనకు బయల్దేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు కరీంనగర్‌లోని లోయర్ మానేరు డ్యాంను పరిశీలించనున్నారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్‌లోనే డిన్నర్ చేసి రామగుండం బయల్దేరనున్నారు. రాత్రి 9 గంటలకు రామగుండం చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
26న ఉదయం 8 గంటలకు రామగుండంలోనే బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. 9 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్‌కు బయల్దేరనున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. 11.30 గంటలకు మేడిగడ్డకు చేరుకోనున్నారు. చెన్నూరులో 2 గంటలకు లంచ్ చేసి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు కేసీఆర్
Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. 42 గేట్లు ఎత్తివేత
Kishan Reddy | అమరావతికి నిధులిస్తే మీకు వచ్చిన ఇబ్బందేంది?: కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి