Jurala Project | జూరాలకు పోటెత్తిన వరద.. 42 గేట్లు ఎత్తివేత
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
మహబూబ్‌నగర్: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం నుంచి 1.97 లక్షల క్యూక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇందులో స్పిల్‌వే ద్వారా 1.69 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 24,201 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల పూర్తిస్థాయి నీటిట్టం 318.51 మీటర్లు కాగా ఇప్పుడు 316.71 మీటర్ల వద్ద నీరు ఉన్నది. అదేవిధంగా ప్రాజెక్టులో 9.65 టీఎంసీల నీటి నిల్వకుగాను ప్రస్తుతం 6.23 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
ఇక ఎగువన మహారాష్ట్రలో ఉన్న ఆల్మట్టి నుంచి 2.25 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నది. ఉదయం 10.30 గంటల వరకు అది 2.50 లక్షలకు చేరవచ్చని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.24 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.623 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థం 33.313 టీఎంసీలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

