గురువారం 21 జనవరి 2021
Sports - Dec 23, 2020 , 16:51:47

సన్‌రైజర్స్‌ను వీడనున్న కేన్‌ విలియమ్సన్‌?

సన్‌రైజర్స్‌ను వీడనున్న కేన్‌ విలియమ్సన్‌?

హైదరాబాద్‌: ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టును వీడుతున్నట్లు  వచ్చిన పుకార్లను ఆ జట్టు కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ కొట్టిపారేశాడు.  న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ ఐపీఎల్‌లో మరో జట్టుకు మారనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ద్వారా విలియమ్సన్‌ ఐపీఎల్‌లో ఇంకో జట్టులోకి వెళ్తున్నాడా? ఇది నిజమేనా? దీనిపై క్లారిటీ ఇవ్వాలని   ఓ నెటిజన్‌ వార్నర్‌ను ట్విటర్లో  కోరాడు. 

'ఈ విషయాన్ని నేను ఇప్పుడే వింటున్నా. కేన్‌ ఎక్కడికీ వెళ్లడు'అంటూ వార్నర్ సమాధానమిచ్చాడు.  ఐపీఎల్‌-2020లో వార్నర్‌, కేన్‌ నిలకడగా రాణించారు. హైదరాబాద్‌ టీమ్‌ 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.  క్వాలిఫయర్‌-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోయింది. 

ఇవి కూడా చదవండి:

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌కూ షమీ డౌటే!logo