Aarambham Movie | ఎమోషనల్ థ్రిల్లర్ ‘ఆరంభం’ ఆడియన్స్‌ని ఆకట్టుకుందా?
Aarambham Movie | C/O కంచరపాలెం (c/o kancharapalem) సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు మోహన్‌భగత్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరంభం’. కీడా కోలా ఫేమ్ రవీంద్ర విజయ్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Aarambham Movie | ‘ఆరంభం’ మూవీ రివ్యూ..
సినిమా పేరు : ‘ఆరంభం’
తారాగణం: మోహన్‌భగత్, రవీంద్ర విజయ్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్
దర్శకత్వం: అజయ్ నాగ్ వి
నిర్మాత: అభిషేక్ వి.టి
విడుదల : మే 10
Aarambham Movie | C/O కంచరపాలెం (c/o kancharapalem) సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు మోహన్‌భగత్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరంభం’. కీడా కోలా ఫేమ్ రవీంద్ర విజయ్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వి.టి (Abhishek) నిర్మిస్తుండగా, అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్లు విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కథ జైలు బ్యాక్‌డ్రాప్‌లో మొదలవుతుంది. కాలాఘటి జైలులో ఒక మర్డర్ కేసు మీదా రెండున్నరేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తుంటాడు మిగిల్(మోహన్ భగత్). అయితే అతడికి కోర్ట్ మరణశిక్ష విధిస్తుంది. రేపు ఉదయం అతన్ని ఉరి తీస్తారు అనగా జైలు నుంచి మాయమవుతాడు మిగిల్. అతడు ఉన్న సెల్‌కి తాళాలు వేసినట్టే ఉంటాయి. ఎక్కడ గోడలు పగిలినట్లు కానీ.. తాళం పగిలినట్లు కానీ ఆనవాళ్లు కనిపించవు. ఇక అతడు ఎలా తప్పించుకున్నాడు అనేది తెలియక పోలీసులు తలలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఈ సస్పెన్స్‌ను చేధించడానికి డిటెక్టివ్ (రవీంద్రవిజయ్) రంగంలోకి దిగుతారు. అసలు మిగిల్ అంత భద్రత ఉన్న జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? అతనికి ఎవరైనా సాయం చేశారా? నాలుగు గోడల మధ్య నుంచి ఎలా మాయమయ్యాడు? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ : విందు భోజనం, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ లాంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అజయ్ నాగ్ వి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా కథను కూడా ఓ కన్నడ నవల ఆధారంగా తీసుకున్నాడు దర్శకుడు. ఈ సినిమాను మొత్తం కాకుండా కొన్ని అధ్యాయాలుగా సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్‌లోనే మొదటి అధ్యాయం ‘ముగింపు’ అంటూ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆసక్తిగా అనిపిస్తుంది. అయితే కథ విషయంలో ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ తప్పదు. ముఖ్యంగా స్లో నరేషన్ ఉంటుంది. అయితే సినిమాలో అమ్మ సెంటిమెంట్ మాత్రం మంచిగా వర్కౌట్ అయ్యింది. మిగిల్ సుబ్రమణ్యరావు కలిసి ఓ సైంటిఫిక్ ప్రాజెక్ట్ కోసం పని చేస్తుంటారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఎంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు: C/O కంచరపాలెం (c/o kancharapalem) సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ నటుడు మోహన్‌భగత్. ఈ సినిమాలో గడ్డం క్యారెక్టర్‌తో మెప్పించి చాలా రోజుల తర్వాత మళ్లీ ఆరంభం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాలో మోహన్‌భగత్ నటన సినిమాకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. తన నటన, హావభావాలతో అదరగొట్టేశాడు. సుప్రిత సత్యనారాయణ్ ఫిమేల్ లీడ్ లో తన పాత్రలో ఒదిగిపోయింది. కీడాకోలా ఫేమ్ రవీంద్రవిజయ్ డిటెక్టివ్ పాత్రలో మెప్పించగా.. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్ గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతికంగా : ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. దేవ్‌దీప్ గాంధీ ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించారు. ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. కథలో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు అజయ్ నాగ్ మాత్రం వంద శాతం సక్సెస్ అయ్యాడు అని చెప్పొచ్చు. మొత్తానికి ‘ఆరంభం’ మూవీ అందరూ చూడదగ్గ సినిమా అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

