PV Sindhu | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Lord Venkateswara) భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి (Venkata Datta Sai), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సింధు దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.
#WATCH | Tirumala, Andhra Pradesh | Badminton Player PV Sindhu, along with her husband businessman Venkata Datta Sai, offer prayers to Lord Venkateswara at Tirumala. pic.twitter.com/geqo3c5ft4
— ANI (@ANI) December 27, 2024
కాగా, పీవీ సింధు – వెంకట దత్తసాయి వివాహం ఈనెల 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా జరిగింది. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
PM Modi | మన్మోహన్ సింగ్‌కు మోదీ నివాళులు
KL Rahul: కేఎల్ రాహుల్ క్లీన్‌బౌల్డ్.. వీడియో
AUSvIND: స్టీవ్ స్మిత్ సెంచరీ.. ఆస్ట్రేలియా 474 ఆలౌట్.. నిరాశపరిచిన రోహిత్ శర్మ