మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు భారత్ .. రెండో సెషన్లో రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్‌కు ముందు చివరి బంతికి కేఎల్ రాహుల్(KL Rahul) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి వరకు మంచి షాట్లు ఆడిన రాహుల్.. ఒక్కసారిగా తన వికెట్లను సమర్పించుకున్నాడు. ప్యాట్ కమ్మిన్స్ వేసిన స్ట్రెయిట్ బంతిని రాహుల్ ఆడలేకపోయాడు. 42 బంతుల్లో మూడు ఫోర్ల సహాయంతో 24 రన్స్ చేశాడు రాహుల్. మెల్బోర్న్ టెస్టులో ఓపెనింగ్ వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం మూడు వికెట్లకే నిష్క్రమించాడు. మూడవ సెషన్లో ఇండియా ప్రెజర్లో పడిపోయే అవకాశం ఉన్నది. అయితే మరో ఓపెనర్ జైస్వాల్ మాత్రం 23 రన్స్ చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 51 రన్స్ చేసింది. మరో 423 రన్స్ వెనుకబడి ఉన్నది.
ABSOLUTE SEED FROM CUMMINS! #AUSvIND | #DeliveredWithSpeed | @nbn_australia pic.twitter.com/zvzvkDyAnb
— cricket.com.au (@cricketcomau) December 27, 2024