మెల్బోర్న్: మెల్బోర్న్ టెస్టు(#AUSvIND) మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 రన్స్‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 34వ సెంచరీ నమోదు చేశాడు. అతను 140 రన్స్ చేసి ఔటయ్యాడు. స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే అనూహ్య రీతిలో స్మిత్ ఔటయ్యాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను 49 రన్స్ చేశాడు. ఆ ఇద్దరూ ఏడో వికెట్‌కు 112 రన్స్ జోడించారు. రెండో సెషన్ సమయంలో ఆస్ట్రేలియా 474 రన్స్‌కు ఆలౌటైంది. స్టార్క్, లయాన్ కొంత సేపు భారత బౌలర్లను సతాయించారు.
Oh dear Steve Smith!
That is as bizarre as it gets 😳 #AUSvIND pic.twitter.com/ZDUWggwBq4
— cricket.com.au (@cricketcomau) December 27, 2024
భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. జడేజా మూడు, ఆకాశ్ దీప్ రెండు, సుందర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. చివరి రెండు టెస్టుల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. మెల్బోర్న్లో ఓపెనర్‌గా రంగంలోకి దిగాడు. కానీ రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. కేవలం మూడు రన్స్‌కే ఔటయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో హుక్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చేశాడు.
Indian skipper Rohit Sharma is gone for just three runs! #AUSvIND pic.twitter.com/m1fLiqKLO7
— cricket.com.au (@cricketcomau) December 27, 2024
తాజా సమాచారం ప్రకారం ఇండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 34 రన్స్ చేసింది.